మహేష్ బాబు కెరీర్ కు సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాను ఎమ్ఎస్.రాజు నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. మహేష్ యాక్షన్, మహేష్ - భూమికల మధ్య లవ్ సీన్స్ తో పాటు ప్రకాష్ రాజ్ విలనిజం సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
అయితే ఈ సినిమాలో మొదట విలన్ పాత్ర కోసం హీరో గోపిచంద్ ను అనుకున్నారు. కానీ అప్పటికే తేజ దర్శకత్వంలో నిజం సినిమా సెట్టయ్యింది. మహేష్ కు విలన్ గా గోపిచంద్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఒక్కడు సినిమాలో ఎమ్ఎస్ రాజు గోపిచంద్ ను తీసుకోవాలని అనుకున్నప్పటికి బ్యాక్ టూ బ్యాక్ మహేష్ విలన్స్ రిపీట్ అయితే బావుండదు అని ప్రకాష్ రాజ్ ను ఫిక్స్ చేశారు. ఆ తరువాత ఎమ్ఎస్.రాజు వర్షం సినిమాలో గోపిచంద్ కు విలన్ గా అవకాశం ఇచ్చాడు. నిజంగా ఒక్కడు సినిమాలో గోపిచంద్ విలన్ గా చేసి ఉంటే మరో రేంజ్ లో ఉండేదని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment