కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసర టైటిల్ తోనే అంచనాలను పెంచేసింది. అయితే చాలా మందికి ఈ పేరు కొత్తగా అనిపించడంతో గూగుల్ సెర్చ్ మొదలు పెట్టారు. ఒకసారి కథ ఏమిటి అనే విషయంలోకి వెళితే.. బింబిసారుడు మగధ సామ్రాజ్య భట్టియా అనే అధిపతి కుమారుడు. క్రీస్తుపూర్వం 543కాలానికి చెందిన మహారాజు. 15 సంవత్సరాల వయసులోనే సింహాసనాన్ని అధిష్టించాడు. ఒక గ్రామాన్ని బలపరచడం నుంచి మగధకు పునాదులు పడ్డాయి. అదే పాటాలిపుత్ర నగరంగా మారింది. తండ్రి , బ్రహ్మదత్త చేతిలో ఓటమి చెందడంతో దానికి ప్రతీకారంగా సైనిక పోరాటానికి నాయకత్వం వహించి విజయాన్ని అందుకున్నాడు.
అతని కోపం అప్పట్లో రాజ్యాలను గడగడాలాడించేది. చరిత్రలోనే అతి భయంకరమైన యుద్దాలను సైతం బింబిసార తన మొండితనంతోనే ఎదిరించాడు. దాదాపు 28 - 38 ఏళ్ల పాటు బింబిసార సామ్రాజ్యాన్ని పాలించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. ఇక ఆయన బుద్దిడికి ప్రత్యేకమైన భక్తుడు అని చెబుతుంటారు. ఆయన ప్రశాంతత కోసం జైన మతంలో కూడా కోనసాగినట్లు తెలుస్తోంది. ఇక చివరికి కొడుకు చేతిలోనే ఖైదీ చేయబడతాడు. మగధ రాజ్యం సింహాసనాన్ని అధిరోహించడానికి కుమారుడు అజాతశత్రు ఆయనను ఖైదు చేసాడని అంటుంటారు. ఇక అజతశత్రు తన మొదటి బిడ్డ పుట్టిన తరువాత తండ్రిని విడుదల చేయాలని ఆదేశించాడు. కాని అప్పటికే బింబిసారుడు మరణించాడని చరిత్ర చెబుతోంది.
Follow @TBO_Updates
Post a Comment