పేపర్ బాయ్‌తో కాజల్ అగర్వాల్!


టాలీవుడ్ చందమామగా తనకంటూ ఇక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కాజల్ అగర్వాల్ దాదాపు అగ్ర హీరోలందరితో నటించింది. కానీ మిగతా సీనియర్ హీరోయిన్స్ మాదిరిగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో సోలో హిట్స్ అంతగా అందుకోలేకపోయింది. ఇక ఈసారి ఒక చిన్న దర్శకుడితో వర్క్ చేసేందుకు సిద్ధమయ్యింది.

పెళ్లయిన తరువాత కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న కాజల్ లేడి ఓరియెంటెడ్ కథలను కూడా బాగానే వింటోంది. ఇక ఇటీవల పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ఆమెకు ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. స్టోరీ పర్ఫెక్ట్ గా అనిపించడంతో అమ్మడు సింగిల్ సిట్టింగ్ లో ఒప్పేసుకుందట. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించాలని ఆలోచిస్తున్నారట. ఇక కాజల్ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువగా డిమాండ్ చేయకుండా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post