టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న విషయం తెలిసిందే. కరోనా తాకిడి కాస్త తగ్గితే రిలీజ్ విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఉండదని నిర్మాత ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు.
షూటింగ్ పనులు కాస్త ఆలస్యంగా మొదలైన కూడా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని కూడా అన్నారు. ఇక దర్శకుడు క్రిష్ ముందుగానే టీజర్ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందుగా హీరోయిన్ నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment