ఏక్ మినీ కథ.. ఇంకా ఉన్నాయి, కుప్పలు కుప్పలుగా!


ఈ రోజుల్లో బిగ్ ప్రొడక్షన్ సంస్థలు చిన్న సినిమాలను తెరకెక్కించాలి అంటే సొంతంగా మరొక బ్యానర్ ను క్రియేట్ చేసి నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ కూడా బ్యానర్ స్థాయికి తగ్గట్లే సినిమాలు చేస్తోంది. అయితే కాస్త స్థాయిని తగ్గించుకోకుండా ఉండడానికి యూవీ కాన్సెప్ట్స్ పేరుతో బోల్డ్ స్టైల్ లో బిజినెస్ చేస్తున్నారు.

నిజానికి చిన్న సినిమాల్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ సెలెక్ట్ చేసుకునే కాన్సెప్ట్ చాలా కీలకమైంది. ఇక రానున్న రోజుల్లో ఈ సంస్థ నుంచి 'ఏక్ మినీ కథ' లాంటి కాన్సెప్టులను చాలానే రిలీజ్ చేస్తారట. సంతోష్ శోభన్ తోనే మరో రెండు సినిమాలకు అగ్రిమెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మారుతి, కొరటాల శివ, మెర్లపాక గాంధీ వంటి దర్శకుల చేత విభిన్నమైన కథలను రాయిస్తున్నారట. వీలైనంత వరకు ఎవరు తెరకెక్కించని సినిమాలను విడుదల చేయాలని యూవీ కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post