Official: మహేష్ - రాజమౌళి కథపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!


సినీ ప్రపంచంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ లలో మహేష్ రాజమౌళి కాంబో ఒకటి. నెవర్ బిఫోర్ అనేలా సెట్స్ పైకి రానున్న ఈ కాంబినేషన్ కోసం అభిమానులు గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి ఒక కథ అయితే సెట్టయ్యింది. అయితే గత ఏడాది నుంచి కూడా వీరు చేయబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనని అనేక రకాల రూమర్స్ వచ్చాయి.

సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఎక్కువగా అడవులలోనే షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఒక టాక్ అయితే వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని నిర్మాత KL నారాయణ వివరణ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వచ్చినా కూడా తాను రెడీ అంటూ మాట్లాడిన ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని అన్నారు. నిజానికి పూర్తి కథ ఏమిటన్నది తనకు కూడా తెలియదని అంటూ ఒక లైన్ అనుకున్న రాజమౌళి దానిపైనే వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. ఇక పూర్తి వివరాలు సినిమా సెట్స్ పైకి వచ్చాకే తెలుస్తుందిని KL నారాయణ తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post