అల్లు అర్జున్ డైరెక్ట్ బాలీవుడ్ ప్లాన్!


స్టైలిష్ స్టార్,  ఐకాన్ స్టార్ అనే ట్యాగ్స్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాపై ఆశలు గట్టిగానే పెట్టుకున్నాడు. ఆ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టి నేషనల్ వైడ్ గా మార్కెట్ సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే బాలీవుడ్ పుష్ప ఏ స్థాయిలో హిట్టయినా కూడా ఒక స్టాండర్ మార్కెట్ అయితే సెట్టవ్వదు.

అందుకే ప్రభాస్ తరహాలో డైరెక్ట్ గా హిందీ ఆఫర్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది హిందీ దర్శకులతో టచ్ లో ఉన్న బన్నీ స్క్రిప్ట్ నచ్చితే వెంటనే ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాడు. కానీ సరైన కథలు తగలడం లేదు. ఎలాగైనా ఈ ఏడాదిలో ఒక బాలీవుడ్ సినిమాను సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడట. మరి అల్లు అర్జున్ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post