మహేష్ బాబు ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తాడు. మహేష్ తో కరెక్ట్ గా ప్లానింగ్ తో సినిమా షూటింగ్ చేయగలిగితే ఏడాదికి రెండు మూడు సినిమాలు ఈజీగా చేయగలడు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆ విదంగా వర్కౌట్ అవ్వడం లేదు. ఇక 8 ఏళ్ళ తరువాత మహేష్ ఒకే ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.
2014లో చివరగా 1 నేనొక్కడినే, ఆగడు వంటి సినిమాలను వెంటవెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది మహేష్ ఒకేసారి రెండు సినిమాలతో రాబోతున్నాడు. సర్కారు వారి పాట 2022 జనవరిలో విడుదల కాబోతుండగా సమ్మర్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విధంగా మహేష్ అభిమానులకు మూడు నెలల గ్యప్ లోనే డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment