పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ షోల కోసం హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.
సినిమా అసలు పాయింట్ మిస్సవ్వకుండా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసే కమర్షియల్ ఎలెమెంట్స్ ను కూడా కరెక్ట్ గా యాడ్ చేసినట్లు టాక్ వస్తోంది. సెన్సార్ నుంచి సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సారి బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్టు కొట్టడం గ్యారెంటీ అని ఒక టాక్ అయితే వస్తోంది. ఇక సినిమా నిడివి 2గంటల 34నిమిషాలని సమాచారం. ఎక్కడ బోర్ కొట్టించకుండా దర్శకుడు వేణు శ్రీరామ్ స్క్రీన్ ప్లేను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో అత్యదిక వేగంగా 30 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్ గా వకీల్ సాబ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
Follow @TBO_Updates
Post a Comment