టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ సర్కారు వారి పాట. గీతగోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగా వేలుతున్నట్లు టాక్ వస్తోంది.
కరోనా కారణంగా అనుకున్న పనులు కరెక్ట్ సమయానికి పూర్తవ్వడం లేదట. అయితే మ్యూజిక్ విషయంలో మాత్రం అలాంటి ఇబ్బందులేమి లేవని తెలుస్తోంది. సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం ఇప్పటికే 3 పాటల ట్యూన్ రెడీ అయినట్లు చెప్పాడు. మొత్తంగా 5 పాటలు ఉంటాయట. ఇక మొదటి సాంగ్ త్వరలోనే రాబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. మరి ఆ సాంగ్స్ సినిమాపై అంచనాలను ఏ మేరకు పెంచుతాయో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment