టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా విడుదలపై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సినిమా తప్పకుండా అనుకున్న సమయానికి వస్తుందని అక్టోబర్ 13 కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమాకు మరొక కొత్త టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.
సినిమాకు సంబందించిన కొన్ని VFX పనుల పట్ల దర్శకుడు రాజమౌళి ఏ మాత్రం సంతృప్తిగా లేడని టాక్ వస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో VFX కంపెనీ పనితీరు చాలా దారుణంగా ఉండడంతో జక్కన్న అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే మరోసారి రీ వర్క్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారట. అయితే ఆ పనుల వల్ల సినిమా విడుదలపై ప్రభావం పడవచ్చని టాక్ కూడా వస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment