RRR @ Mind Blowing Pre-release Business!!


టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR  కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా నెవర్ బిఫోర్ అనేలా వండర్స్ క్రియేట్ చేసేలా ఉందని టీజర్లతోనే చెప్పేశారు. ఇక సినిమాకు సంబందించిన మొత్తం హిందీ హక్కులను పెన్ స్టూడియోస్ దక్కించుకుంది. 

సినిమా నాన్ థియేట్రికల్ గానే 250 నుండి 300కోట్ల వరకు అంధించినట్లు తెలుస్తోంది. అన్ని రకాలుగా కలుపుకొని సినిమా 800కోట్ల నుంచి 850కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక బాక్సాఫీస్ వద్ద 550 కోట్ల బ్రేక్ ఈవెన్ (సుమారు 1000 కోట్ల గ్రాస్) టార్గెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియా లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ బిజినెస్ క్రియేట్ చేయలేదు. ఎక్కువగా రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోనే సినిమాకు హిందీలో మంచి డీల్ సెట్టయ్యింది. మరి ఈ మూవీ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post