RC15: శంకర్ పెద్ద టెన్షన్ తగ్గించేశాడు!


శంకర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక రకంగా గ్రాఫిక్స్ వాడాలని అనుకుంటాడు. పాటల కోసమే కోట్లు ఖర్చు చేసి అందులో విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలని ఎంతో ఇష్టపడతాడు. ఇక ఈసారి రామ్ చరణ్ తో చేస్తున్న 15వ సినిమాలో కూడా అలాంటి సీన్స్ ఉంటాయా అనే సందేహం రాకుండా ఉండదు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో మొదటిసారి వర్క్ చేస్తున్న శంకర్ ఆయనతో ఏ స్థాయిలో ఖర్చ చేస్తాడనే సందేహం కూడా కలుగుతోంది. అయితే దిల్ రాజు ముందుగానే బడ్జెట్ విషయంలో పక్కాగా అగ్రిమెంట్ కుదర్చుకున్నట్లు సమాచారం. ఇక అందుకే శంకర్ రామ్ చరణ్ సినిమాలో బడ్జెట్ ఎక్కువయ్యే గ్రాఫిక్స్ సీన్స్ ను పెట్టడం లేదట. పొలిటికల్ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్నట్లు తెలుస్తోంది..


Post a Comment

Previous Post Next Post