PushpaRaj @ Intro Teaser Talk!!


టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప కూడా నిలవబోతున్నట్లు ఒక క్లారిటీ వచ్చేసింది. పుష్పరాజ్ ఇంట్రడక్షన్ టీజర్ తోనే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు సుకుమార్ క్లారిటీగా చెప్పేశాడు. చూస్తుంటే దేవిశ్రీప్రసాద్ ఈ ఒక్క సినిమాతోనే థమన్ స్పీడ్ కు చెక్ పెట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. బిజిఎమ్ తో ఫస్ట్ టీజర్ కు ఒక పవర్ ఇచ్చాడు.

టీజర్ మొత్తం గురించి మాట్లాడుకుంటే చాలా చెప్పొచ్చు. కానీ ఒక్క ఫైట్ ఎపిసోడ్ మాత్రం మరో లెవెల్లో ఉంటుందని రెండు మూడు షాట్స్ తోనే చూపించేశారు. మొహానికి బట్ట చుట్టి ఉండడం. వెనకాల చేతులు కట్టేసి ఉన్న పుష్ప రాజ్ విలన్లను ఎదుర్కొంటున్న తీరు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. సినిమా మొత్తంలో ఆ ఫైట్ ఎవరు ఊహించని విదంగా ఉంటుందట.  ప్రతి ఫ్రేమ్ లో సుకుమార్ హై విజువల్ మేకింగ్ కనిపిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి


Post a Comment

Previous Post Next Post