ఒక బిగ్ బడ్జెట్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ క్లిక్కవ్వకపోతే సినిమాకు అర్థం ఉండదు అనేది అందరికి తెలిసిన విషయమే. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు సుకుమార్ మొదటిసారి ఒక ఫుల్ యాక్షన్ మోడ్ లో సినిమాను డిజైన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా కీలకం కాబట్టి ఒక ఎపిసోడ్ కోసం 40కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. దాదాపు 150కోట్లకి పైగా భారీ బడ్జెట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో 500 మందితో చేసే ఒక హై వోల్టేజ్ సీన్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. నిర్మాతలు కూడా సుకుమార్ విజన్ కు తగ్గట్లుగాన్స్ ఖర్చు చేస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ బద్ధ ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment