టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారు అనేది కన్ఫ్యూజన్ గా మారింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆల్ మోస్ట్ స్టార్ట్ కాబోతోంది అనుకున్న సమయానికి సినిమా క్యాన్సిల్ అవ్వడం అందరిని షాక్ కు గురి చేసింది. కథపై అభ్యంతరం వల్లనే తారక్ తప్పుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో బుచ్చిబాబుతో కూడా చేయవచ్చని టాక్ వచ్చింది.
త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు అనగానే ఎన్టీఆర్ కొరటాల సినిమాపై మరొక టాక్ వచ్చింది. బుచ్చిబాబుతో చేయాలని ఉన్నప్పటికీ ఇంకా కాన్ఫిడెంట్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని సమాచారం. ఎన్టీఆర్ ఒప్పుకుంటే మరుసటి రోజే కొబ్బరి కాయ కొట్టేసి సినిమాను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తారక్ మదిలో RRR తరువాత మరో పాన్ ఇండియా చేస్తే బావుంటుందని ఆలోచన కూడా ఉంది. ఇక ప్రశాంత్ నీల్ తో చేద్దామంటే అతను సలార్ అయిపోయే వరకు దొరకడు. మరి ఈ కన్ఫ్యూజన్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment