అల్లు అర్జున్ పుష్పా టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్‌తో అల్లు అర్జున్, సుకుమార్ పవర్ఫుల్ హిట్టు కొట్టేలా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆగస్టు 13 న పుష్పా తెరపైకి రానున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు ప్రకటించాగా ఇప్పుడు ఆ డేట్ మారే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. పైగా కోవిడ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదు.
ఇక RRR రిలీజ్ వాయిదా పడితే సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఆ డేట్ కూడా కుదరకపోతే క్రిస్మస్ కంటే ముందు డిసెంబర్ 17 న పుష్పాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సంక్రాంతి ఇతర సీజన్లలో పెద్ద సినిమాలు బుక్కయ్యాయి కాబట్టి క్రిస్మస్ సీజన్ బెస్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయినట్లు సమాచారం. విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది..
Follow @TBO_Updates
Post a Comment