అగ్ర దర్శకుడు శంకర్ కెరీర్ లో మొదటిసారి నిర్మాతలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. గతంలో అతను ఫిక్స్ అయిన బడ్జెట్ ఇంకాస్త పెరిగేది గాని కొంచెం కుడా తగ్గేది కాదు. కానీ ఇండియన్ 2 విషయంలో మాత్రం బడ్జెట్ విషయం లో శంకర్ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి ఆ సినిమాను పక్కనపెట్టి రామ్ చరణ్ తో మరో సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ శంకర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లింది. సినిమాకు కేటాయించిన 220కోట్ల బడ్జెట్ లో ఇప్పటికే 180కోట్ల వరకు ఖర్చు చేసిన శంకర్ సినిమాను మధ్యలో ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగిలిన రెమ్యునరేషన్ ను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ మిగిలిన షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇక లైకా ఆరోపణల ప్రకారం
సమాధానం ఇవ్వాలని మద్రాస్ హై కోర్టు శంకర్ కు నోటీసులు అందించింది. మరి ఆ వివాదంపై శంకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఒక వేళ ఇండియన్ 2స్టార్ట్ అయితే శంకర్ - రామ్ చరణ్ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత ఆలస్యం కావచ్చు.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment