జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల త్రివిక్రమ్ సినిమాను క్యాన్సిల్ చేసుకొని కొరటాల శివతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ అలా సెట్ చేసుకోవడం వలన ఆగిపోతుందని అనుకున్న ఒక సినిమా మరింత తొందరగా సెట్స్ పైకి రావడానికి అవకాశం వచ్చింది.
పుష్ప అనంతరం అల్లు అర్జున్ కొరటాల శివతో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ తారక్ నిర్ణయంతో కొరటాల మిస్సయ్యారు కాబట్టి బన్నీ మరో కమిట్మెంట్ కోసం వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ తెరకెక్కించబోయే ఐకాన్ సినిమాకు బన్నీ ఎప్పుడో ఓకే చెప్పాడు. ఇక పుష్ప అనంతరం అతని డేట్స్ దొరుకుతాయి కాబట్టి దిల్ రాజు ఫోకస్ పెట్టాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఐకాన్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు చెప్పారు.
Follow @TBO_Updates
Post a Comment