టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా బిజీ అవుతున్నారు. కమర్షియల్ సినిమలైనా సరే కంటెంట్ ఉన్న కథలైనే సరే.. నచ్చితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకే చెప్పేస్తున్నారు. ఇక కీయరా అద్వానీ కూడా గ్యాప్ లేకుండా తెలుగు సినిమాలు చేయాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఆమె ఫోకస్ పాన్ ఇండియా సినిమాలపై పడింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఆమెను హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల ఎన్టీఆర్ 30పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. హీరోయిన్ గా ఇద్దరు ముగ్గురి పేర్లు లిస్టులోకి రాగా కీయరా అద్వానీ ఫైనల్ అయినట్లు సమాచారం. ఇదివరకే కొరటాల శివ భరత్ అనే నేను సినిమాలో కీయరా మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment