మరో విషాదం: రంగం దర్శకుడు కన్నుమూత!!


సినిమా పరిశ్రమలో మరొక తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు KV ఆనంద్ కన్నుమూశారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఒకే ఒక్కడు, బాయ్స్, శివాజీ వంటి సినిమాకు ఆనంద్ కెమెరామెన్ గా వర్క్ చేశారు. అనంతరం 2005లో దర్శకుడిగా కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.

ఇక శుక్రవారం ఉదయం హార్ట్ ఎటాక్ కారణంగా ఆనంద్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. 54ఏళ్ళ ఆనంద్ దర్శకుడిగా కూడా పలు మంచి చిత్రాలను తెరకెక్కించారు. రంగం, వీడోక్కడే,   బ్రదర్స్, బందోబస్త్ వంటి మంచి సినిమాలను తెరక్కెకించి తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇటీవల కోలీవుడ్ లో కమెడియన్ వివేక్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక అంతలోనే మరొక విషాధం చోటు చేసుకోవడం కోలీవుడ్ సినీ ప్రముఖులు కలచివేసింది.


Post a Comment

Previous Post Next Post