వకీల్ సాబ్ ను దెబ్బకొట్టబోతే.. ప్లాన్ రివర్స్!!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది. రీమేక్ సినిమా కాబట్టి అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ ఉండకపోవచ్చని అనుకున్నారు. ఇక రాజకీయాల గోడవతో ఆంద్రప్రదేశ్ లో కావాలని పవన్ కళ్యాణ్ ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసినట్లు క్లియర్ గా అర్ధమయ్యింది. 

ఏ సినిమాకు అమలు కానీ పాత టికెట్ల ధరలు వకీల్ సాబ్ కు అమలు చేయడం అందరికి షాక్ ఇచ్చింది. పైగా కలెక్టర్లు అధికారులు రంగంలోకి దిగడం విశేషం. అదే విధంగా రాజకీయ నాయకులు కూడా పనిగట్టుకొని కామెంట్స్ చేయడం విశేషం. ఈ విషయాలతోనే సినిమాకు ఒక రకంగా సింపతి వర్కౌట్ అయ్యింది. కావాల్సినంత బజ్ కూడా వచ్చింది. ఆంద్రప్రదేశ్ లో సినిమాకు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్ర, రాయలసీమలో కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. మరి భవిష్యత్తులో పవన్ సినిమాలపై ఇంకా ఎన్ని ప్లాన్స్ వేస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post