Pushpa, Akhanda... Biggest Gambling??


ఒకప్పుడు సినిమా మార్కెట్ అనేది రిలీజ్ తరువాత టాక్ ను బట్టి ఒక్క వారంలోనే మారిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం టీజర్ నుంచే అంచనాలు క్రియేట్ అవుతుండడంతో షూటింగ్ పూర్తవ్వకముందే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది. ఇక ఇటీవల అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ ఈజీగా 50మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా బాలకృష్ణ అఖండ కూడా ఆ మార్క్ ను అందుకోవడానికి దగ్గరలో ఉంది.

అయితే ఈ వ్యూవ్స్ ఇంత త్వరగా ఎలా వస్తున్నాయనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గూగుల్ యాడ్స్ ద్వారా కూడా వ్యూవ్స్ భారీగా అందుతున్నట్లు సమాచారం. అందుకోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఒక విధంగా డిస్ట్రిబ్యూటర్లకు ఇది పెద్ద గ్యాబ్లింగ్ ఆటలాంటిదనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సినిమాకు జెన్యూన్ గా బజ్ భారీ స్థాయిలో ఉందని మార్కెట్ కు మించిన రేటుకు కొనుగోలు చేయడానికి ముందుకు వాస్తారు. ఆ తరువాత సినిమా పెట్టిన పెట్టుబడిని అందుకోకపోతే నోరాళ్ళబెట్టక తప్పదు. మరి నిర్మాతలు ఎలాంటి బిజినెస్ తో సినిమాను విక్రయిస్తారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post