టాలీవుడ్ లో కామెడీ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు మారుతి నెక్స్ట్ పక్కా కమర్షియల్ అనే సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. గోపిచంద్ హీరోగా నటిస్తున్న ఆ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అయితే కరోనా వల్ల చాలా గ్యాప్ రావడంతో ఈ దర్శకుడు కూడా ఒక సినిమా అయిపోగానే మరొక సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.
ఇటీవల మాస్ మహారాజా రవితేజతో మరోసారి చర్చలు జరిపి కథను సెట్ చేసుకున్నట్లు సమాచారం. అసలైతే పక్కా కమర్షియల్ సినిమాను రవితేజ తోనే చేయాలనీ అనుకున్నారు. కానీ యూవీ క్రియేషన్స్ రెమ్యునరేషన్ విషయంలో విబేధాలు వచ్చి రవితేజను తప్పించింది. అయినప్పటికీ మారుతి అతన్ని వదల్లేదు. ఇటీవల మరొక కథపై ఇద్దరు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక మాస్ రాజా రెండు సినిమాల తరువాత మారుతితో కొత్త సినిమా చేయవచ్చని టాక్.
Follow @TBO_Updates
Post a Comment