దేశమంతా కరోనా సెకంస్ వేవ్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ లేకుండా రోజుకు వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కొన్ని విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను డేంజర్ జోన్ లో పడేయడానికి ఇష్టం లేక పరీక్షలు వాయిదా వేశాయి. అయితే తిరుపతిలోని మోహన్ బాబు విద్యాసంస్థల యాజమాన్యం పరీక్షల విషయంలోలో మొండిగా వ్యవహరిస్తున్నారని అన్ని వర్గాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఇప్పటికే 150మందికి కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిందని ఒక స్టాఫ్ మెంబర్ కూడా కరోనా బారిన పడి మరణించినట్లు చెబుతున్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులంతా నినాదాలు చేశారు. అయితే యాజమాన్యం మాత్రం అడిగితే బెదిరిస్తున్నారని సెల్ ఫోన్స్ కూడా పగల గొట్టేస్తున్నారు అంటూ వీడియో రిలీజ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చినా కూడా పరీక్షలు రాయాల్సిందే అంటూ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆ వీడియోలో చెప్పారు. ఇక త్వరలోనే విద్యార్థుల నిర్ణయంపై మోహన్ బాబు స్పందించనున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment