వకీల్ సాబ్ ఏప్రిల్ 9న గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేది తగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు డోస్ పెరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ అయితే మాములుగా లేదు. అయితే కొన్ని గాసిప్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ సినిమాలో ఒక గెస్ట్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వస్తోంది. నిజానికి ఈ రూమర్స్ రాకపోవడానికి కారణం లేకపోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్ ఇంటర్వ్యూలలో వకీల్ సాబ్ లో ఒక సర్ ప్రైజ్ ఉందని చెబుతున్నారు. ఇక ఒకనొక టైమ్ లో అకిరా నందన్ తండ్రి షూటింగ్ కు వెళ్లిన మాట నిజమే. మరి ఇప్పుడు వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment