తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విద్యాసంస్థలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను కాలేజిలను పలు ముఖ్యమైన విద్యా సంస్థలపై లాక్ డౌన్ వర్తిస్తుందని చెప్పడంతో హై కోర్టు సీరియస్ అయ్యింది.
కేవలం విద్యాసంస్థలను మాత్రమే క్లోజ్ చేసి మిగతా వాటిపై ఎందుకు ఆంక్షలు విధించలేదని ప్రశ్నించింది. మద్యం దుకాణాలు బార్లు పబ్బులు థియేటర్లపై ఆంక్షలు ఎందుకు విధించలేదని ప్రశ్నించడంతో ఒక్కసారిగా విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినీ పరిశ్రమ ఉపందుకుంటున్న సమయంలో కోర్టు నుంచి ఇలాంటి వివరణ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక 24గంటల్లో ఈ విషయంపై వివరణ ఇవ్వాలని హై కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Follow @TBO_Updates
Post a Comment