U/A సర్టిఫికెట్ తో సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ 2 గంటల 35నిమిషాల రన్ టైమ్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే మొదట్లో సినిమా మొత్తంగా 2గంటల 38వరకు రెడీ చేశారు. కానీ సెన్సార్ రూల్స్ వలన 3 నిమిషాల వరకు సీన్ డైలాగ్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మహిళల హక్కులకు సంబంధించిన సెన్సిటివ్ లైన్ తో తెరకెక్కిన విషయం తెలిసిందే.
అయితే సినిమా కథకు తగ్గట్లు కొన్ని బలమైన పదాలను ఉపయోగించక తప్పలేదట. Bitch, F*ck అనే పదాలను కూడా ఉపయోగించారట. అలాగే తెలుగు బూతులను కూడా అక్కడక్కడా సినిమా కోసం వాడాల్సి వచ్చిందట. అయితే సెన్సార్ నుంచి అభ్యంతరం రావడంతో సినిమాలో చాలా డైలాగ్స్ ను తీసేయ్యాల్సి వచ్చినట్లు సమాచారం. ఇక వకీల్ సాబ్ సినిమా ఈ నెల 9న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment