అపరిచితుడు కథను తన పర్మిషన్ లేకుండా ఎలా టచ్ చేస్తారు అంటూ రీసెంట్ గా నిర్మాత V రవిచంద్రన్ శంకర్ ను హెచ్చరిస్తూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథపై సర్వ హక్కులు తనవే అంటూ వివరణ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆలస్యం చేయకుండా శంకర్ కూడా వెంటనే స్పందించారు.
రవిచంద్రన్ అర్థం లేని ఆరోపణలు చేశారని ఈ సినిమాను అడ్డుకోవడానికి ఆయనకు ఎలాంటి హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు. 2005లో విడుదలైన అపరిచితుడు సినిమాకు ఆయన నిర్మాతగా మాత్రమే వ్యవహరించారు అంటూ సినిమా టైటిల్స్ లో వచ్చినట్లు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పూర్తిగా తనదే అన్నారు. ఇక రైటర్ సుజాత కథ విషయంలో ఎలాంటి సహకారాన్ని అంధించలేదు అంటూ ఆమె డైలాగ్స్ మాత్రమే అందించినట్లు చెప్పారు. పూర్తి కథ కథనం తనది మాత్రమే అంటూ ఈ కథను ఎలాగైనా మలుచుకునే హక్కులు తనుకున్నాయని శంకర్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment