ఈ ఏడాది ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడికి బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో జాతిరత్నాలు టాప్ 1లో ఉంది. ఇక ఈ సినిమా ఇప్పటికే 25రోజులను పూర్తి చేసుకుంది. 30కోట్లకు పైగా షేర్స్ అందుకొని ట్రిపుల్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇకపోతే సినిమాకి సంబంధించిన మరొక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తారని ఒక టాక్ వస్తోంది. ఇది నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఇప్పటివరకైతే అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు. సాధారణంగా చిన్న బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పవర్ఫుల్ హిట్ అందుకుంటే రీమేక్ హక్కుల కోసం ఎగబడటం కామన్. అయితే జాతిరత్నాలు సినిమా టోటల్ గా లోకల్ ఫ్లేవర్ తో వచ్చింది. పైగా నటీనటుల టాలెంట్ తో హిట్టయిన సినిమా. కాబట్టి రీమేక్ చేస్తే స్క్రిప్ట్ పై చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment