పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో సరికొత్త బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో దిల్ రాజు మరో సినిమా చేయడానికి ఆఫర్ కొట్టేశాడు. మంచి కథ ఉంటే సెట్ చేసుకోమ్మని పవన్ కమిట్మెంట్ ఇచ్చాడట. అయితే వకీల్ సాబ్ విషయంలో వేణు శ్రీరామ్ ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అభిమానులు కొంత కంగారు పడ్డారు.
ఇక ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే దిల్ రాజు వంశీ పైడిపల్లిని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంశీ కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకునే టాలెంట్ ఉన్నప్పటికీ అతని మేకింగ్ చాలా రొటీన్ గా ఉంటుందని చాలాసార్లు కామెంట్స్ వచ్చాయి. మహర్షి దెబ్బకు మహేష్ మళ్ళీ అతనితో వర్క్ చేయలేదు. ఇక ఈసారి దిల్ రాజు వంశీ - పవన్ కాంబో సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇంకా ఫైనక్ అయితే కాలేదు గాని కథతో దిల్ రాజును మెప్పిస్తే ప్రాజెక్ట్ సెట్టయినట్లే. ఇక ఆ కంగారులోనే అభిమానులు వామ్మో వంశీ వద్దు బాబోయ్ అనే కామెంట్స్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment