పాన్ ఇండియా సినిమాలను డైరెక్ట్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. కొన్నిసార్లు సినిమా కంటెంట్ అన్ని భాషలకు కనెక్ట్ కాకపోవచ్చు. ఇక దర్శకుడు రాజమౌళి తరువాత ఆ స్థాయిలో కాకపోయిన తనదైన రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. బాహుబలి తరువాత బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ గా KGF నిలిచింది.
అయితే దర్శకుడు ప్రశాంత్ రాజమౌళి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. KGF 2 పూర్తవ్వకముందే ప్రభాస్ తో సలార్ ను స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశాడు. ఇక ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు అల్లు అర్జున్ తో కూడా కమిట్మెంట్ తీసుకున్నాడు. ఇక KGF 2 హిట్టయితే ప్రభాస్ తో మరో సినిమా చేయడానికి రెడీ కావచ్చు. ఈ విధంగా వరుస ప్రాజెక్టులతో ఈ కన్నడ దర్శకుడు రాజమౌళి కంటే వేగంగా వెళుతున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment