సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ అనేవి ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ కాంబో గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దాదాపు పవన్ కెరీర్ మొదలైనప్పటి నుంచి కూడా అలీతో నటిస్తూ వస్తున్నాడు. అయితే మధ్యలో రాజకీయాల కారణంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా అలీ వైసీపీతో కలవడం అలాగే పవన్ పై ఎవరు ఊహించని విధంగా విమర్శలు చేయడంతో మళ్ళీ వీరి మధ్య మాటలు ఉండవని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమి లేదని తప్పకుండా మళ్ళీ కలిస్తే సినిమా చేస్తానని అలీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక మొత్తానికి ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ పవన్ తో చేయబోయే సినిమాలో అలీ కోసం కూడా ఒక పాత్రను క్రియేట్ చేసినట్లు సమాచారం. పవన్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయొట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment