టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నెంబర్ వన్ పాన్-ఇండియా హీరోగా చక్రం తిప్పుతున్న విషయం తెలిసిందే. రాబోయే రెండేళ్లలో నాలుగు పాన్-ఇండియా ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. బాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం రెబల్ స్టార్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
సిల్వెస్టర్ స్టాలోన్ యొక్క హాలీవుడ్ కల్ట్ యాక్షన్ డ్రామా, రాంబో హిందీ రీమేక్‌పై గత ఏడాది నుంచి అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. యువ బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, తేదీలు అందుబాటులో లేనందున ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రభాస్ ను లైన్ లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలని గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నారు. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment