టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా దెబ్బకు పెద్ద సినిమాల విడుదల తేదీలు మళ్ళీ చెల్లా చెదురయ్యే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ తరువాత క్రాక్ హిట్టుతో ఒక్కసారిగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాల విడుదల డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కరోనా సీక్వెల్ వల్ల రెండు మూడు నెలల వరకు రిలీజ్ విషయంపై ఎవరు నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే కారొనా కారణంగా సినిమా రిలీజ్ విషయంలో ఎవరెవరో ఎంత బాధపడుతున్నారో తెలియదు గాని RRR తెరకెక్కిస్తున్న రాజమౌళి మాత్రం హ్యాపీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం అక్టోబర్ 13న RRR రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త ఎక్కువ టైమ్ కావాలని జక్కన్న సందిగ్ధంలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఈ దెబ్బతో తప్పు మొత్తం కరోనాపై వేసేసి హ్యాపీగా సంక్రాంతికి లేదా ఆ తరువాత సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ మైండ్ గేమ్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment