ఒక సినిమా ఓటీటీ రిలీజ్ అనేది ఇప్పుడు ఒక సరికొత్త బిజినెస్ లా మారింది. ఒక రోజు తేడాతో డీల్స్ విషయంలో కోట్లల్లో లెక్కలు మారుతున్నాయి. ఇక పెద్ద సినిమాలు చాలా వరకు 50 రోజుల తరువాతే ఓటీటీ డిజిటల్ వరల్డ్ లోకి రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.
అయితే మరికొన్ని సినిమాలు మాత్రం రిజల్ట్ ను బట్టి వారం పది రోజుల్లోనే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఇక వకీల్ సాబ్ కూడా తొందరగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తానికి తన పోరాటాన్ని ముగించింది. కరోనా వ్యాప్తి ఎక్కువవ్వడం వలన థియేటర్స్ వైపు జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక వకీల్ సాబ్ కు ఆ ఎఫెక్ట్ పడడంతో మే 7వ తేదీన రిలీజ్ చేసుకునేలా ఆమెజాన్ చర్చలు జరుపుతోంది. ఇదివరకే వాళ్ళతో దిల్ రాజు ఒక డీల్ సెట్ చేసుకోగా ఇప్పుడు అడ్వాన్స్ రిలీజ్ కోసం కొత్త డీల్ మాట్లాడుకుంటున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment