Adivi Sesh about Mahesh Babu on Major!!


26/11 ముంబై ఉగ్ర దాడుల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక GMB ప్రొడక్షన్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. అయితే అందులో ఉగ్ర వాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికుల్లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఒకరు. ఈ రియల్ హీరో జీవితాన్ని తెరపైకి తీసుకు వస్తున్న రీల్ హీరో అడివి శేష్. ఈ సినిమాను మహేష్ హోమ్ ప్రొడక్షన్ లో నిర్మించారు. నేడు సినిమా టీజర్ ను విడుదల చేసిన అడివి శేష్ లాంచ్ ఈవెంట్ డైమండ్ లాంటీ విషయాన్ని చెప్పాడు.

'మా అన్నయ్య ఒకసారి నాకు ఒక విషయాన్ని చెప్పాడు. నిజమైన కోహినూర్ వజ్రాన్ని ఒక పేపర్ మీద పెట్టి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫార్మ్ మీద రూ.5 అమ్మితే ఎవరు కొనరు. కానీ అదే డైమండ్ ను తనిస్క్ షో రూమ్ లో పెట్టి 2000కోట్లు అంటే.. అంతేనా అనే బిజినెస్ మెన్ తప్పకుండా ఉంటారు. మేజర్ సందీప్ సార్ కోహినూర్. ఇక నిర్మాత అయిన మహేష్ బాబు ఫ్లాట్ ఫార్మ్ లాంటి వారు. సినిమాను ప్రపంచం ముందు నిలబెట్టారు. ఆయనకున్న ఎంతో మంది అభిమానులు ఈ సినిమాను తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళతారు..' అంటూ అడివి శేష్ వివరణ ఇచ్చారు.


Post a Comment

Previous Post Next Post