పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తే ఎవరైనా సరే చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. నిర్మాత అయినా దర్శక్కులైనా సరే ఆయనను దగ్గరగా చూస్తే మళ్ళీ దూరం వెళ్ళడానికి ఇష్టపడరు. ఇక ప్రస్తుతం కరోనా బారిన పడిన పవర్ స్టార్ ను కంటికి రెప్పలా చూసుకుంటున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మరెవరో కాదు. సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగ వంశీ.
హారిక హాసిని చినబాబు కుమారుడైన వంశీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పవన్ కరోనా భారిన పడడంతో వెంటనే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన నగవంశీ పవన్ కళ్యాణ్ కు వైద్యానికి కావాల్సిన అవసరాలను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అపోలో టీమ్ ఉన్నప్పటికీ బయట నుంచి కావాల్సిన సహకారాలు మొత్తం వంశీ ద్వారానే అందుతున్నాయట. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ముందుగా వంశీకి ఫోన్ చేస్తున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment