చాలా కాలం తరువాత నాగార్జున నుంచి వచ్చిన డిఫరెంట్ యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పుడు సినిమాకు మంచి ఓటీటీ డీల్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేసుకోవడానికి 27కోట్లు ఆఫర్ చేసింది.
బడ్జెట్ కంటే కాస్త ఎక్కువ ఎమౌంట్ చెప్పడంతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక లాక్ డౌన్ అనంతరం ఉప్పెన, క్రాక్ వంటి సినిమాలు బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో తప్పకుండా సినిమా కంటెంట్ క్లిక్కవుతుందని మళ్ళీ మనసు మార్చుకున్నారు. నెట్ ఫ్లిక్స్ డీల్ ను క్యాన్సిల్ చేసుకొని థియేట్రికల్ గా రిలీజ్ చేశారు . నెట్ ఫ్లిక్స్ దాదాపు సగం రేటు తగ్గించేసి 50రోజుల తరువాత స్ట్రీమింగ్ చేసుకోవడానికి డీల్ సెట్ చేసుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు కొంచెం తొందరగా రిలీజ్ చేసుకోవడానికి మరో డీల్ సెట్టయినట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment