టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కోసం అభిమానుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా మొదటి రోజే 50కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది అభిమానం అందరిని షాక్ కు గురి చేస్తోంది.
ఇటీవల వకీల్ సాబ్ థియేటర్ లో ఒక అభిమాని ఏకంగా చేయి కోసుకొని వెండితెరపై PSPK అని రాయడం అందరిని షాక్ కు గురి చేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆంద్రప్రదేశ్ లో ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఏకంగా థియేటర్స్ పై రాళ్లు కూడా విసిరారు.
Post a Comment