టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాపై అప్పుడే రూమర్స్ డోస్ ఎక్కువయ్యాయి. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే స్టోరీ లైన్ కు సంబంధించిన రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. జనతా గ్యారెజ్ అనంతరం కలిసి వర్క్ చేయబోన్నారు కాబట్టి అంచనాలు అయితే మాములుగా ఉండవు.
ఇక కొరటాల శివ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకోకుండా తన మంచి స్టోరీ లైన్ తోనే ఆడియెన్స్ కు కిక్కిస్తుంటాడు. ఇక తారక్ 30వ సినిమా మెయిన్ స్టోరీ ఇదే అంటూ ఒక టాక్ వైరల్ అవుతోంది. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చే కుర్రాడు మహా నగరంలో జరిగే ఒక పెద్ద స్కామ్ పై పోరాటం చేస్తాడట. దేశాన్ని ప్రభావితం చేసే అంశంపై ఒంటరిగా పోరాడే కామన్ మ్యాన్ గా కనిపిస్తాడట. పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి సినిమాలో బాలీవుడ్ కోలీవుడ్ కు సంబంధించిన అగ్ర నటీనటులు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment