గ్లామరస్ బ్యూటీ రష్మీక మందన్న మెల్లగా బాలీవుడ్ కు ఒక రూట్ సెట్ చేసుకుంటోంది. గత ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నికేవ్వరు సినిమాతో హిట్టు కొట్టగానే అమ్మడి రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఏకంగా బన్నీ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
అయితే ఆ సినిమా విడుదలకు ముందే అమ్మడికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే సిద్దార్థ్ మల్హోత్రాతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కూడా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏక్తా కపూర్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న గుడ్ బై సినిమాలో రష్మీక ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుందట. రష్మీక కంటే ముందు కొంతమంది హీరోయిన్స్ ను సంప్రధించారట. కానీ ఫైనల్ గా ఈ బ్యూటీకే గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment