టాలీవుడ్ సీనియర్ నిర్మాత దిల్ రాజు కూడా మెల్లగా తన ప్రొడక్షన్ స్థాయిని పెంచుకుంటున్నాడు. బాలీవుడ్ లో జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవ్వగా అనుకోకుండా బ్రేకులు పడ్డాయి. లైకా శంకర్ గొడవ కారణంగా రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా ఆలస్యంగా మొదలయ్యే పరిస్థితి ఏర్పడింది.
అసలు విషయంలోకి వస్తే.. దిల్ రాజు ఇంతవరకు 100కోట్ల బడ్జెట్ ను దాటించింది లేదు. మొదటిసారి పాన్ ఇండియా కథను టచ్ చేస్తిన్నాడు. శంకర్ తో సినిమా అంటే మినిమమ్ 150కోట్లు పెట్టుకోవాలి. అయితే ఆ రెమ్యునరేషన్ కు సంబంధించిన గాసిప్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ కు అలాగే శంకర్ కు చెరో 40కోట్లను ఇస్తున్నట్లు సమాచారం. ఇక మిగిలిన 70కోట్లల్లో సినిమాను నిర్మిస్తారట. కానీ శంకర్ మేకింగ్ కు ఆ బడ్జెట్ ఎంతవరకు సరిపోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి దిల్ రాజు ఏ విధంగా డీల్ చేస్తాడో..
Follow @TBO_Updates
Post a Comment