కరోనా వైరస్ దెబ్బకు గత ఏడాది రావాల్సిన సినిమాలన్నీ ఈ ఏడాది కుప్పలు కుప్పలుగా థియేటర్స్ లోకి రాబోతున్నాయి. కరోనా వైరస్ రెండవ వేవ్ మొదలైన కూడా జనాలు సినిమాల కోసం ఎగబడుతున్నారు. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ ట్రైలర్ తోనే బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధమయ్యింది. ఇక ఏప్రిల్ లో 7 సినిమాలు విభిన్నమైన జానర్స్ లో రానున్నాయి.
ఏప్రిల్ 2న రానున్న నాగ్ వైల్డ్ డాగ్ NIA క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అదే రోజు వస్తున్న కార్తీ సుల్తాన్ 100 మంది విలన్స్ తో సందడి చేయబోతున్నాడు. ఏప్రిల్ 9న రానున్న వకీల్ సాబ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ట్రైలర్ తోనే రికార్డులను క్రియేట్ చేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16 న విడుదల అవుతోంది. శేఖర్ కమ్ముల మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యేలా ఉంది. ఇక నేచురల్ స్టార్ నాని మాస్ ఫ్యామిలీ మూవీ టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదలవుతోంది. సాయి పల్లవి రానా దగ్గుబాటి ఆసక్తికరమైన ప్రయత్నం విరాటా పర్వం ఏప్రిల్ 30 న విడుదల కానుంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న గోపిచంద్ సీటిమార్ ఏప్రిల్ 30 న విడుదల కానున్నట్లు సమాచారం. మరికోన్ని డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. మొత్తంగా టాలీవుడ్ లో ఏప్రిల్ నెలలో 250కోట్ల బిజినెస్ జరగనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment