వకీల్ సాబ్ కు మరో 12కోట్లు.. అత్యాశతో కొత్త తలనొప్పి!!


టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన బిగెస్ట్ మూవీ వకీల్ సాబ్. పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. కోవిడ్ వలన థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో సినిమాను ఆమెజాన్ ప్రైమ్ లో తొందరగానే రిలీజ్ చేయడానికి మరో డీల్ సెట్ చేసుకున్నారు.

అసలైతే ఫస్ట్ డీల్ (14కోట్లు) ప్రకారం 50రోజుల తరువాత ఈ సినిమాను విడుదల చేయాల్సి ఉండగా అమెజాన్ ప్రైమ్ మరొక 12కోట్లు ఇచ్చి ముందుగానే రిలీజ్ చేసింది. మొత్తంగా ఓటీటీ ద్వారా దిల్ రాజుకు 26కోట్లు వచ్చాయి. అయితే దుబాయ్ కు చెందిన డిస్ట్రిబ్యూటర్ ఈ డీల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒప్పందం ప్రకారం 50రోజుల తరువాతే ఓటీటీలో విడుదల చేయాలని లేకపోతే తాము 3కోట్ల వరకు నష్టపోతామని అన్నారు. ఇక 3కోట్లు ఇవ్వకపోతే లీగల్ నోటీసులు కూడా అందిస్తామని ఆ డిస్ట్రిబ్యూటర్ హెచ్చరించినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post