అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా విడుదలకు ముందు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా విడుదల తరువాత డిజాస్టర్ కావడం వలన మహేష్ బాబుతో అనుకున్న ఒక బిగ్ బడ్జెట్ సినిమా చర్చల దశలోనే ఆగిపోయిందట. అఖిల్ సినిమాను వివి.వినాయక్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాకు కథను ఆ అంధించింది మాత్రం వెలిగొండ శ్రీనివాస్.
ఢమరుకం కథను రాసిన ఆ రైటర్ మొదట 'అఖిల్' కథను రామ్ చరణ్ కోసం రాజుకున్నాడట. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ సినిమా కథకు హీరో క్రేజ్ కరెక్ట్ గా బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా తేడా కొట్టేసినట్లు చెప్పాడు. అయితే మహేష్ బాబుతో ఒక ఏలియన్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట. డైరెక్టర్ కోడి రామకృష్ణకు అప్పట్లో కథను చెప్పగా చాలా మెచ్చుకున్నట్లు చెప్పాడు. అయితే అఖిల్ హిట్టయ్యి ఉంటే ఆ కథను డెవలప్ చేసే ధైర్యం వచ్చేదని అఖిల్ ప్లాప్ అవ్వడం వల్లే ధైర్యం చేయలేకపోయానని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment