ఫిదా సినిమాతో 90కోట్ల గ్రాస్ తో బాక్సాఫీస్ హిట్ అందుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని చేసిన మూవీ లవ్ స్టోరీ. చూస్తుంటే ఈ సినిమాతో 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేసేలా ఉన్నట్లు అర్ధవుతోంది. పైగా నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్. ఇప్పటికే సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసాయి.
సినిమా 100కోట్ల టార్గెట్ కు చేరుకోవడానికి మరొక దారిని సెట్ చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. మళయాలంలో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది కాబట్టి సినిమా తప్పకుండా అక్కడ క్లిక్కయ్యే ఛాన్స్ ఉంది. ఇక కన్నడలో తెలుగు సినిమాలకు హిట్ టాక్ వస్తే రెస్పాన్స్ మామూలుగా ఉండదు, మరి సినిమా 100కోట్ల వరకు వెళుతూంధో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment