ఒకప్పుడు వరుసగా డిజాస్టర్స్ ఎదురైతే హీరో మార్కెట్ పై ప్రభావం గట్టిగానే పడేది. కానీ నేటితరం హీరోలు మాత్రం వీలైనంత వరకు ఆ ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. శర్వానంద్ కూడా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ మార్కెట్ ను కాపాడుకుంటున్నాడు. ఒక విధంగా అతను ఎంచుకుంటున్న సరికొత్త కాన్సెప్ట్ కథలు కూడా అందుకు బాగా హెల్ప్ అవుతున్నాయి. వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఎదుర్కొన్నప్పటికీ శ్రీకారంపై పెద్దగా ప్రభావం చూపలేదని అర్ధమవుతోంది.
ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 17కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి దిగుతోంది. నిజానికి శర్వానంద్ 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తరువాత ఇంతవరకు సక్సెస్ చూడలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు ఏ స్థాయిలో డిజాస్టర్స్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలన్నీ కూడా విడుదలకు ముందు హడావుడి గట్టిగానే చేశాయి. అయితే శ్రీకారం మాత్రం డీసెంట్ హోప్స్ తో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ సినిమాతో శర్వా ఏ రేంజ్ లో హిట్టు కొడతాడో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment