నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమా చేస్తే చూడాలని ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే గత ఏడాది ఆయన ఒక యువ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ రాగా మళ్ళీ క్యాన్సిల్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే మళ్ళీ చాలా రోజుల అనంతరం ఆ న్యూస్ వైరల్ అవుతోంది.
యువ హీరో నాగశౌర్యకు ఒక కొత్త దర్శకుడు చెప్పిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా బాగా నచ్చేసిందట. అయితే అందులో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం స్టార్ హీరో అయితే బావుంటుందని మొదట బాలకృష్ణను కలుసుకున్నారు. అప్పుడు బోయపాటి సినిమాతో బిజీగా ఉండడం వలన ఆలస్యం అవుతుందని చెప్పగా చిత్ర యూనిట్ నాగార్జునను కూడా సంప్రదించారు. కానీ నాగ్ కూడా ఇప్పుడు బిజీ అయ్యాడు. దీంతో మళ్ళీ బాలకృష్ణ వద్దకే వచ్చినట్లు తెలుస్తోంది. కథపై పాజిటివ్ గా ఉన్న బాలకృష్ణ త్వరలోనే మరోసారి ఆలోచించి నిర్ణయాన్ని చెప్పనున్నట్లు సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment