కరోనా కష్ట కాలంలో సినిమాలకు రావడం చాలా కష్టమని అనుకుంటున్న సమయంలో జనాలు మంచి కంటెంట్ తో వస్తే కరోనా ఉన్నా ఏ మాత్రం లెక్క చేయడం లేదు. అయితే థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు 50% ఆక్యుపెన్సీతో ఉంటే టికెట్ల రేట్లు గట్టిగానే పెంచారు. జనాల నుంచి అప్పుడు పెద్దగా విమర్శలు ఏమి రాలేదు. కానీ ఇప్పుడు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నా కూడా రేట్లు గట్టిగానే పెంచుతున్నారు.
శ్రీకారం సినిమా సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్స్ రూ.120ఎక్కువ అనుకుంటే ఇప్పుడు రూ.150కి పెంచారు. ఇక మల్టీప్లెక్స్ లో అయితే రూ.200 ధర పలుకుతోంది. మొన్న చెక్ సినిమాకు ఇలానే తొందరపడి మిడిల్ క్లాస్ ఆడియెన్స్ ను దూరం చేసుకున్నారు. పైగా డివైడ్ టాక్ రావడంతో సినిమా కనీసం రెండు రోజులు కూడా స్టాన్డెర్డ్ గా కలెక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు శ్రీకారం నిర్మాతలు కూడా అదే తరహాలో టికేట్స్ రేట్స్ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. మరి సినిమాపై ఆ ప్రభావం ఎంతవరకు కనిపిస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment